ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి Venugopalతో రేవంత్, భట్టి భేటీ

ABN , First Publish Date - 2022-07-05T18:24:13+05:30 IST

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాలతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయ్యారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి Venugopalతో రేవంత్, భట్టి భేటీ

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్(Venugopal)తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Batti vikramarka) మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణాలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై  ప్రధానంగా చర్చ జరుగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (Yashwanth sinha) హైదరాబాద్ రాక,  హనుమంతరావు (Hanumanth rao) హాజరు, జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి స్పందించిన తీరు తదితర పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీపరంగా ఇప్పటివరకు చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీలోకి చేరికలు తెలంగాణలో మరోసారి రాహుల్ పర్యటన గురించి నేతలు చర్చించనున్నారు. పార్టీలో చేరికల గురించి ఇప్పటికే రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పాల్గొన్నారు. 

Read more