అర్వింద్‌కు కూడా కవితకు పట్టిన గతే పడుతుంది: రేవంత్
ABN , First Publish Date - 2022-03-21T01:30:12+05:30 IST
ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చని కవితకు నిజామాబాద్ ప్రజలు ఘోరంగా ఓడించారని

కామారెడ్డి: ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చని కవితకు నిజామాబాద్ ప్రజలు ఘోరంగా ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ మన ఊరు-మన పోరు సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గెలిపిస్తే 2 రోజుల్లో పసుపు బోర్డ్ తెస్తానని ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని తెలిపారు. హామీ ఎందుకు నెరవేర్చలేదో అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. అర్వింద్‌కు కూడా కవితకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. వరి వేయవద్దని సీఎం కేసీఆర్ అంటున్నారని, కాళేశ్వరం నీళ్లు, ఉచిత కరెంట్ ఎవరి ముక్కులో పెట్టాలన్నారు. సీఎం అయ్యాక కేసీఆర్ కుటుంబానికి.. వందల ఎకరాల భూములు, వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ధనిక రష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వని పరిస్థితి వచ్చిందా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.