Rescue Operation : మరో గంటలో రాజును బయటకు తీసుకొచ్చే అవకాశం

ABN , First Publish Date - 2022-12-15T11:28:59+05:30 IST

రాళ్ళ గుహలో ఇరుక్కున్న రాజు కోసం రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. మరో గంటలో ఆపరేషన్ ముగిసే అవకాశం ఉంది.

Rescue Operation : మరో గంటలో రాజును బయటకు తీసుకొచ్చే అవకాశం

కామారెడ్డి : రాళ్ళ గుహలో ఇరుక్కున్న రాజు కోసం రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. మరో గంటలో ఆపరేషన్ ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పెద్ద బండ రాళ్లను రెస్క్యూ బృందం తొలగించింది. మరో చిన్న రాయిని ధ్వంసం చేసి రాజును క్షేమంగా బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజు వద్దకు వెళ్లి రెస్క్యూ సభ్యుడు నీరు, జ్యుస్ అందించాడు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. అడవిలో షికారుకు వెళ్లి సెల్‌ఫోన్ పడిపోతే తీసుకునేందుకు యత్నించి జారి రాళ్ల సందులోంచి ఓ గుహలో రాజు ఇరుక్కుపోయాడు.

Updated Date - 2022-12-15T11:29:00+05:30 IST