గోల్కొండ పీఎస్ లోనే మాజీ మంత్రి Renuka chowdary

ABN , First Publish Date - 2022-06-16T23:59:18+05:30 IST

ఎస్‌ఐ కాలర్ పట్టుకున్నారని మాజీ మంత్రి రేణుక చౌదరిని(Renuka chowdary) పోలీసులు కస్టడీలోనే ఉంచారు.

గోల్కొండ పీఎస్ లోనే మాజీ మంత్రి Renuka chowdary

హైదరాబాద్‌: ఎస్‌ఐ కాలర్ పట్టుకున్నారని మాజీ మంత్రి రేణుక చౌదరిని(Renuka chowdary) పోలీసులు కస్టడీలోనే ఉంచారు.గోల్కొండ పీఎస్‌లో ఉన్న కేంద్ మంత్రి రేణుకా చౌదరిని విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందునినాదాలుచేశారు.ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేవరకు గోల్కొండ పీఎస్‌లోనే రేణుకాచౌదరిని వుంచనున్నట్టు పోలీసులుతెలిపారు. 


ఈసందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ యూనిఫామ్‌ను ఎలా గౌరవించాలో మాకు తెలుసునని అన్నారు.పోలీసుల పట్ల మాకు గౌరవం ఉందన్నారు. అయితే మాచుట్టూ మగ పోలీసులు ఎందుకు ఉన్నారని ఆమెప్రశ్నించారు.వెనకాల నుంచి నన్ను తోసేశారు.బ్యాలెన్స్ తప్పి కిందపడే క్రమంలో అతని షోల్డర్ పట్టుకున్నానని రేణుకా చౌదరి తెలిపారు.పోలీసుల్ని అవమానించడం నా ఉద్దేశం కాదని,కక్ష సాధింపు కోసం విచారణ సంస్థలను కేంద్రం దుర్వినియోగిస్తోంది ఆమె ఆరోపించారు. 

Updated Date - 2022-06-16T23:59:18+05:30 IST