మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ఉపశమనం

ABN , First Publish Date - 2022-08-02T08:23:08+05:30 IST

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్స్‌కు హాస్టల్‌ విధుల నుంచి ప్రభుత్వం ఉపశమనం..

మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ఉపశమనం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్స్‌కు హాస్టల్‌ విధుల నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హాస్టల్‌ బాధ్యతలను కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లకు అప్పగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలను సమర్పించింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ధిక్కరణ వ్యాజ్యాన్ని ముగించింది. 

Updated Date - 2022-08-02T08:23:08+05:30 IST