రాజ్యసభ సభ్యుడిగా Ravichandra ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2022-05-30T16:43:09+05:30 IST
రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూఢిల్లీ/తెలంగాణ: రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రవిచంద్రతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. రవిచంద్ర తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్ ముదిరాజ్, తాత మధు హాజరయ్యారు.