బాలికపై అత్యాచారం.. నిందితునికి 25 ఏళ్ల జైలు

ABN , First Publish Date - 2022-07-05T10:30:07+05:30 IST

బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి(పోక్సో కోర్టు) శ్యాంశ్రీ సోమవారం తీర్పునిచ్చారు.

బాలికపై అత్యాచారం.. నిందితునికి 25 ఏళ్ల జైలు

కొత్తగూడెం లీగల్‌, జూలై 4 : బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి(పోక్సో కోర్టు) శ్యాంశ్రీ సోమవారం తీర్పునిచ్చారు. కొత్తగూడెంనకు చెందిన శ్రీనివాస్‌ ఓ బాలికపై అత్యాచారం చేశాడంటూ 2019 మే 7న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు అనంతరం అప్పటి డీఎస్పీ అలీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 13మంది సాక్షులను విచారించిన అనంతరం శ్రీనివా్‌సపై నేరం రుజువైందని న్యాయస్థానం భావించింది. దీంతో శ్రీనివా్‌సకు సెక్షన్‌ 42 పోక్సో యాక్ట్‌ ప్రకారం 25సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా లేదా జరిమానాకు బదులుగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్‌ 56 భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా లేదా జరిమానా కింద 2 నెలల కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Read more