రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభం నేడే

ABN , First Publish Date - 2022-08-25T08:11:33+05:30 IST

రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభం నేడే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా..

అనంతరం సీఎం బహిరంగ సభ


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. కొంగరకలాన్‌ సమీపంలో రూ.58.20 కోట్లతో ఆధునిక హంగులతో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టరేట్‌ పక్కన ఖాళీ స్థలంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సభకు 50వేల మందికి పైగా హాజరవుతారని అంచనా. 

Updated Date - 2022-08-25T08:11:33+05:30 IST