KTR SIR..మా గోడు వినండి..

ABN , First Publish Date - 2022-02-16T16:18:18+05:30 IST

తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్ల

KTR SIR..మా గోడు వినండి..

మా భూములు ఇప్పించండి: జిల్లెల గ్రామ దళితులు

హైదరాబాద్/కవాడిగూడ: తమకు న్యాయం చేయాలని కోరుతూ  మంగళవారం లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లె గ్రామ దళితులు మొరపెట్టుకున్నారు.  గ్రామ దళితులు ఆకారపు ఎల్లయ్య, గౌరీశంకర్‌, ఎర్రశంకర్‌  మాట్లాడుతూ, జిల్లెల్ల గ్రామ శివారులోని సర్వేనెం. 671, 672లో గల భూమిని 20 సంవత్సరాలుగా  దళిత కుటుంబాలు సాగుచేసుకుంటున్నాయని వారు చెప్పారు. గ్రామ సర్పంచ్‌ మాట్ల మఽధు తాము సాగుచేసుకుంటున్న భూమిని అమ్ముకుంటున్నాడనీ.. ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Read more