రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి సంచారం

ABN , First Publish Date - 2022-03-05T16:12:30+05:30 IST

జిల్లాలోని గంబీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి సంచారం

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంబీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో లేగ దూడ పై చిరుత పులి దాడి చేసింది. నిన్న కోనరావుపేటలో ఆవుపై చిరుత దాడి చేసింది. రెండు రోజుల్లో రెండు సార్లు చిరు దాడి చేయడంతో రైతులు, స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Read more