నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-08-04T10:30:13+05:30 IST
కాంగ్రెస్ భిక్షతో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి.. నిస్సిగ్గుగా కుంటిసాకులతో పార్టీకి రాజీనామా చేస్తున్నాననడం అవకాశవాదానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు.
టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ భిక్షతో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి.. నిస్సిగ్గుగా కుంటిసాకులతో పార్టీకి రాజీనామా చేస్తున్నాననడం అవకాశవాదానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అనేక అవకాశాలు కల్పించి గుర్తింపునిస్త.. నమ్మకద్రోహానికి వారసుడిగా మారిపోయారన్నారు. స్వార్థపూరిత, వ్యక్తిగత లాభం కోసం పార్టీ ఫిరాయిస్తున్నాడని దుయ్యబట్టారు. కన్నతల్లిలాంటి పార్టీని కన్నకొడుకుల్లా ఆదరించాల్సింది పోయి.. దొంగ కొడుకుల్లా తయారై పార్టీని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ జెండాను మరోసారి ఎగురవేయాల్సిన చారిత్రక అవసరముందని సుధాకర్ గౌడ్ అన్నారు.