రైల్వేస్టేషన్‌ విధ్వంసం కుట్ర ఓ హోటల్‌లో జరిగింది: రైల్వే ఎస్పీ

ABN , First Publish Date - 2022-06-25T18:54:26+05:30 IST

రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటన చేశారు. ప్రధాన సూత్రధారి సుబ్బారావుగా పోలీసులు తేల్చారు.

రైల్వేస్టేషన్‌ విధ్వంసం కుట్ర ఓ హోటల్‌లో జరిగింది: రైల్వే ఎస్పీ

సికింద్రాబాద్‌: రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటన చేశారు. ప్రధాన సూత్రధారి సుబ్బారావుగా పోలీసులు తేల్చారు. సుబ్బారావును అరెస్ట్ చేశామని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అకాడమీ ఉద్యోగులు శివ, మల్లారెడ్డి, బీసీరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బోడుప్పల్‌లోని ఓ హోటల్‌లో కుట్రలకు ప్లాన్‌ చేసినట్లు రైల్వే ఎస్పీ పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్‌ విధ్వంసానికి ప్లాన్ చేశారని చెప్పారు. అల్లర్ల కోసం సుబ్బారావు రూ.35 వేలు ఖర్చుచేశారని అన్నారు. అల్లర్ల తర్వాత సాక్ష్యాలను  సుబ్బారావు తారుమారు చేసినట్లు ఆరోపించారు. వాట్సాప్ గ్రూప్ మెసేజ్‌లను సుబ్బారావు డీలీట్ చేశారని రైల్వే ఎస్పీ పేర్కొన్నారు.


Updated Date - 2022-06-25T18:54:26+05:30 IST