మరోసారి తెలంగాణకు Rahul.. కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధం..

ABN , First Publish Date - 2022-07-05T18:44:33+05:30 IST

సెప్టెంబర్‌(September)లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రానున్నారు.

మరోసారి తెలంగాణకు Rahul.. కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధం..

Hyderabad : సెప్టెంబర్‌(September)లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రానున్నారు. మంత్రి కేటీఆర్(Minister KTR) నియోజకర్గమైన సిరిసిల్ల(Sirisilla)కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి చేరికలు పుంజుకుంటున్నాయి. ఇక ముందు కూడా తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి చేరేందుకు పలువురు ముఖ్య నేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. భారీ జాబితాకు నాయకత్వం రూపు కల్పన చేసింది. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణకు రాహుల్  రానున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని సమాచారం.

Read more