రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు
ABN , First Publish Date - 2022-04-05T01:28:25+05:30 IST
నగరంలో డ్రగ్స్ వ్యవహారంలో సంచలన సృష్టించిన రాడిసన్
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ వ్యవహారంలో సంచలన సృష్టించిన రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పబ్, లిక్కర్ లైసెన్సులను రద్దు చేసింది. 24 గంటలపాటు మద్యం సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకున్నది. జనవరి 21న మద్యం సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి పొందింది. రూ.56 లక్షలు బార్ టాక్స్ చెల్లించి అనుమతిని తీసుకున్నారు. 2B బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొందారు. అయితే పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది.