బైబ్యాక్ విధానంలో విత్తనాల కొనుగోలు
ABN , First Publish Date - 2022-12-15T00:44:53+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి విత్తనాలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎ్‌సడీసీ) రీజనల్ మేనేజర్ సీహెచ్.కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తె లిపారు. విత్తనాలను తొలుత రైతులకు పంపిణీ చేసి పంట దిగుబడి వచ్చాక విత్తనాల ను రైతుల నుంచి తిరిగి కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి రెండు రకా ల పంటలు జనుము, మేత మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
టీఎ్‌సఎ్‌సడీసీ ఆర్‌ఎం కృష్ణవేణి
సూర్యాపేట సిటీ, డిసెంబరు 14 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి విత్తనాలను బైబ్యాక్ విధానంలో కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎ్‌సడీసీ) రీజనల్ మేనేజర్ సీహెచ్.కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తె లిపారు. విత్తనాలను తొలుత రైతులకు పంపిణీ చేసి పంట దిగుబడి వచ్చాక విత్తనాల ను రైతుల నుంచి తిరిగి కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి రెండు రకా ల పంటలు జనుము, మేత మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విత్తనాలు రైతుల వద్ద ఉంటే కొనుగోలు చేసి మిర్యాలగూడెం పరిధిలోని నందిపహాడ్ గ్రామంలో ఉన్న టీఎస్ సీడ్స్ కార్యాలయానికి సరఫరా చేస్తామన్నారు. క్వింటా విత్తనాల కు రూ.6,000 చెల్లిస్తామన్నారు. జనుము, మేత మొక్కజొన్న విత్తనాలు ఉన్న రైతులు సమీపంలోని పీఏసీఎస్ కేంద్రాలు, రైతు ఆగ్రో సేవా కేంద్రాల్లో సంప్రదించాలని కోరారు. బైబ్యాక్‌విధానంలో రైతుల నుంచి సేకరించిన విత్తనాలను టీఎస్ సీడ్స్ కంపెనీలో విత్తన శుద్ధి చేసి తిరిగి రైతులకు వచ్చే వానాకాలం సీజన్‌లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.