కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ఎదుట నిరసన
ABN , First Publish Date - 2022-12-07T00:47:55+05:30 IST
ఏళ్ల తరబడి తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్త ఇంటి ఎదుట కూర్చొని భార్య నిరసన తెలిపింది. ఈ సంఘటన మండలంలోని నందిపాడులో మంగళవారం చోటుచేసుకుంది.
కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ఎదుట నిరసన
మిర్యాలగూడ, డిసెంబరు 6: ఏళ్ల తరబడి తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్త ఇంటి ఎదుట కూర్చొని భార్య నిరసన తెలిపింది. ఈ సంఘటన మండలంలోని నందిపాడులో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరా ల ప్రకారం... మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారోజు రామాచారి-కళమ్మల కుమార్తె మాధవిని నందిపాడు గ్రామానికి చెందిన బసవోజు సు రేష్‌కు ఇచ్చి 2015లో వివాహం జరిపించారు. మాధవి మూడు నెలల గర్భిణిగా ఉన్న ప్పుడు ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అ నంతరం లక్ష్మీపురంలోని తల్లి గారింటికి వచ్చింది. అప్పటి నుంచి సురేష్ తనను కాపురానికి తీసుకెళ్లకపోవడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయి నా భర్తలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మాధవి తెలిపిం ది. ఫలితం లేకపోవడంతో తన కుమార్తె డింపుల్ రాణి, తల్లి కళమ్మ, తమ్ముడు చారి తో కలిసి భర్త ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. కాగా సురేష్ తల్లి తిరుపతమ్మ మా ట్లాడుతూ భార్య పుట్టింటికి పోయి తిరిగి రాకపోవడంతో తన కుమారుడు కూడా ఇం టికి సక్రమంగా రావడం లేదని చెప్పింది. సోమవారం కోడలు మాధవి ఇంటికి వచ్చి తనపై దాడి చేసి కొట్టిందని ఆరోపించారు. భార్య నుంచి విడాకుల కోసం కుమారుడు కోర్టులో కేసు వేశాడని తెలిపారు. ఏదైనా ఉంటే భార్యాభర్తలిరువురు కోర్టులోనే తేల్చుకోవాలని ఆమె సూచించారు.