వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాల ప్రవచనం
ABN , First Publish Date - 2022-12-18T00:10:07+05:30 IST
పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాస వ్రత తిరుప్పావై పాశురాల ప్రవచనం శనివారం భక్తిరసంగా సాగిం ది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారు రచించిన తిరుప్పావై మొదటి పాశురాన్ని ఆలకించి పరవశం పొందారు.
వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాల ప్రవచనం
నల్లగొండకల్చరల్, డిసెంబరు 17: పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాస వ్రత తిరుప్పావై పాశురాల ప్రవచనం శనివారం భక్తిరసంగా సాగిం ది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారు రచించిన తిరుప్పావై మొదటి పాశురాన్ని ఆలకించి పరవశం పొందారు. రామగిరిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కోగంటి వెంకటాచార్యస్వామి ఆధ్వర్యంలో ప్రవచనం జరిగింది. వీ టీ కాలనీలోని శ్రీదేవి భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంసీ పద్మ ఆధ్వర్యంలో అదేవిధంగా తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, షేర్‌బంగ్లాలోని సంతోషిమాత ఆలయం, బీట్ మార్కెట్‌లోని రామకోటి స్తూప దేవాలయం, పానగల్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో మొదటి పాశురాల ప్రవచనం అత్యంత భక్తిపరవశంగా సాగింది. అమ్మవారిని అలంకరించి వేదికపై ఆశీనులను చేసి పూజలు చేసిన అనంతరం పాశురాలను ప్రవచించారు.