రాజ్యాంగాన్ని మార్చాలని అడగొచ్చు

ABN , First Publish Date - 2022-02-28T09:03:16+05:30 IST

భారత రాజ్యాంగాన్ని మార్చాలని అడిగే వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉందని ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలని అడగొచ్చు

వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉంది: మాడభూషి శ్రీధర్‌


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, పిబ్రవరి 27: భారత రాజ్యాంగాన్ని మార్చాలని అడిగే వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉందని ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో టీఎ్‌సయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం అవసరమా?’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన ఏడాదికే 1951లో మొట్టమొదటి సారి సవరణ చేసి అదే కొత్త రాజ్యాంగమని చెప్పారన్నారు. భారత రాజ్యాంగం మొదట రాసినప్పుడు బాగానే ఉందని, కానీ దానికి ఇప్పటి వరకు 105 సవరణలు చేసి హక్కులను హరించుకుంటూ వచ్చామని చెప్పారు. రాజ్యాంగంలో ప్రతి అక్షరం, పదం, ఆర్టికల్‌ తొలగించి కొత్త ఆర్టికల్‌ పెట్టుకోవచ్చని అంబేడ్కర్‌ కూడా చెప్పారన్నారు. 

Updated Date - 2022-02-28T09:03:16+05:30 IST