ప్రీ వెడ్డింగ్ షూట్ జంటపై తేనెటీగల దాడి
ABN , First Publish Date - 2022-04-18T13:03:28+05:30 IST
నగర శివారులో ప్రీ వెడ్డింగ్ షూట్ జంటపై తేనెటీగలు దాడిచేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేనెటీగల దాడిలో

హైదరాబాద్/చాదర్‌ఘాట్/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారులో ప్రీ వెడ్డింగ్ షూట్ జంటపై తేనెటీగలు దాడిచేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ జంట నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికి త్స పొందారు. మహబూబ్‌నగర్‌కు చెం దిన అనురాగ్‌రెడ్డి, శివాణి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎల్బీనగర్లోని రాక్‌టౌన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి మే నెల లో పెళ్లి జరగనుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ నెల 11న పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు సమీపంలోని కోహెడ గుట్టపైకి ఫొటో షూట్‌కు వెళ్లారు. ఫొటో ఎఫెక్ట్ కోసం పొగ పెట్టగా సమీపంలోని తేనె తుట్టెకు వ్యాపించి తేనెటీగలు వీరి పై దాడి చేశాయి. గుట్టపై ఆల యం ఉండడంతో గదిలోకి వెళ్లికొద్దిసేపు తలదాచుకున్నారు. మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు.