రాష్ట్రపతి ఎన్నికలపై KCR భేటీ

ABN , First Publish Date - 2022-06-11T00:54:51+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

రాష్ట్రపతి ఎన్నికలపై KCR భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల అంశంపై సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా దేశంలో తాజా రాజకీయాలపై కూడా కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 25తో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుండడంతో ఈ లోపు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల్లో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ.. కేసీఆర్‌ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. టీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉండిపోతుందా? లేక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి, ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడానికి కేసీఆర్‌ వ్యూహాన్ని పన్నుతున్నారా? అని చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ జాతీయ స్థాయి పర్యటనలు చేపడుతూ విపక్షాలను కూడగడుతున్నది ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికేనని అంటున్నారు. ప్రస్తుతం ఆయన దీనిపైనే వ్యూహ రచన చేస్తున్నారని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-11T00:54:51+05:30 IST