మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-03-03T02:48:20+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసును నగర పోలీసులు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసును నగర పోలీసులు ఛేదించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. పేట్ బషీరాబాద్‌లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి మంత్రి హత్యకు మహబూబ్‌నగర్ వాసులు కుట్ర పన్నారన్నారు. పేట్ బషీరాబాద్‌లో పోలీసులకు ఫరూక్ ఫిర్యాదు చేశాడు. ఫరూక్ ఫిర్యాదుతో యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో రఘును అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి నివాసంలో రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించిన అనంతరం వారిని పోలీసులు వదిలేశారు. హత్య కుట్ర కోణాన్ని ఢిల్లీ పోలీసులకు  సైబరాబాద్ పోలీసులు తెలిపారు. Read more