దయచేసి టెండర్లు వేయండి

ABN , First Publish Date - 2022-12-07T23:36:16+05:30 IST

ప్రతీపనిలో కనీసం ఐదు నుంచి 10 శాతం మిగులు బాటు ఉండడంతో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. పనులులేక మిషన్లు చేతికందకుండా పోతాయని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని భావించిన సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికి లెస్‌కు వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతారు.

దయచేసి టెండర్లు వేయండి

కాంట్రాక్టర్లకు ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎమ్మెల్యేల ఫోన్లు

ఐదు శాతం అదనంగా ఇస్తామన్నా స్పందించని కాంట్రాక్టర్లు

బకాయిలు చెల్లించకపోవడంతోనే సమస్య

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ) : ప్రతీపనిలో కనీసం ఐదు నుంచి 10 శాతం మిగులు బాటు ఉండడంతో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు పోటీపడుతుంటారు. పనులులేక మిషన్లు చేతికందకుండా పోతాయని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని భావించిన సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికి లెస్‌కు వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటిది తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. టెండర్లు వేయండి మహప్రభో అన్నా.. ఎవరూ ముందుకు రావడంలేదు.

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులతోపాటు కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి రూ.50 కోట్ల విలువైన పనులకు పలుమార్లు టెండర్లు పిలుస్తున్నా ఉమ్మడి నల్లగొండ ్లఆ్లలో స్పందన లేదు. ‘నిధుల చెల్లింపునకు పాస్‌ ఆర్డర్‌ వస్తున్నా కంపెనీల ఖాతాల్లో నగదు జమ కాని ఈ టెండర్లు మాకొద్దు బాబోయ్‌’ అన్నట్లు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఏం చేయా లో పాలుపోని అధికారులు కొందరు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు ఫోన్‌చేసి ‘ప్లీజ్‌... ప్లీజ్‌ టెండర్లు వేయండి’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. బిల్లులు ఇప్పించే బాధ్యత మాదే, ఈ కొన్ని పనులు ప్రారంభించండి’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.

శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు

శెట్టిపాలెం-భీమారం-సూర్యాపేట రహదారికి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి శంకుస్థాపనచేసి ఎనిమిదేళ్లవుతుంది. ఆయన మంత్రిగా ప్రా రంభించిన మొదటి పని అది.28 కిలోమీటర్ల రహదారి పని లో నేటికీ ఇంకా నాలుగు కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. టెండర్లు ఖరారై, అగ్రిమెంట్‌ చేసుకుని, తాను కొబ్బరికాయ కొట్టి నాలుగు నెలలు అయినా పనులు ప్రారంభంకాలేదని ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఎదుట దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ నుంచి అడవిదేవులపల్లి వరకు 15కిలోమీటర్ల రహదారి పనులకు టెండర్లు ఖరారైనా కాంట్రాక్టర్లు పని ప్రారంభించలేదు, నార్కట్‌పల్లి-అద్దంకి హైవే మిర్యాలగూడ పట్టణం నుంచి వెళుతోంది. పక్కన డ్రైన్స్‌ గురించి పట్టించుకోకపోవడం మూ లంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆర్‌అండ్‌బీ అధికారుల ఎదుట ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని లింగగిరిలో కాంట్రాక్టు పనిచేపట్టిన సదరు కాంట్రాక్టర్‌ చనిపోవడంతో పని ఆగిపోయింది. కాగా ప్రత్యామ్నాయ కాంట్రాక్టర్‌ ముందుకొచ్చే పరిస్థితి లేదు. నల్లగొండ-యాదాద్రి భువనగి రి జిల్లాలను కలిపే కీలకమైన చిట్యాల, వలిగొండ, ఇంద్రపాలనగరం, భువనగిరి రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చి ఏడాది పూర్తయినా స్పందనలేదు. నల్లగొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలనుంచి జిల్లా కేంద్రానికి రావాలం టే డబుల్‌ రోడ్లు లేవు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈకొద్ది పనులే కాదు పెద్దసంఖ్యలో ఈ పరిస్థితి నెలకొంది. యాదా ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం నుంచి చౌటుప్పల్‌కు రూ.1.65కోట్లతో నాలుగుసార్లు టెండర్లు పిలిచినా స్పందనలేదు. నాంపల్లి నుంచి పసునూరు వరకు రూ.1.68 కోట్లతో టెండర్లు పిలవగా కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నా రు. ఇదే తరహాలో దేవరకొండ నియోజకవర్గంలో కంబాలప ల్లి నుంచి పొగిళ్ల వరకు, చింతపల్లి నుంచి గడియగౌరారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నుంచి ఇప్పర్తి వరకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని హాలియా నుంచి ఆంజనేయతండా వరకు కుంకుడు చెట్టు తండానుంచి మహబూబ్‌నగర్‌ వరకు, నల్లగొండ నుంచి ముషంపల్లి వరకు, నల్లగొండ నుంచి కట్టంగూరు వరకు పలుమార్లు రూ.20కోట్ల విలువైన పనులకు నల్లగొండ జిల్లాలో టెండర్లు పిలువగా స్పందనలేదు. ఇదేతరహాలో సూర్యాపేట జిల్లాలో రూ.19కోట్ల విలువైన పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందనలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.10కోట్ల విలువైన రోడ్డు మరమ్మతు పనులకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు.

తాజాగా రూ.216కోట్లతో దెబ్బతిన్న 713కిలోమీటర్ల పనులకు టెండర్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,621 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు విస్తరించి ఉన్నాయి. భారీ వర్షాలు, గ్రామాల్లో కేజీవీల్స్‌ వేసుకుని రోడ్లపై వెళ్లడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం మూలంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 713 కి.మీల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతులకు రూ.216కోట్లు అవసరం ఉన్నట్లు ప్రతిపాదన తయారు ుచేసి టెండర్లకు సిద్ధమయ్యారు. బీబీనగర్‌-భూదాన్‌పోచంపల్లి రోడ్డు, పోచంపల్లి-పెద్దరావులపల్లి, భువనగిరి-చిట్యాల, చిట్యాల-శాపల్లి, హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రోడ్డులో మొసంగి, పోల్కంపల్లి రోడ్లు కంకరతేలి గుంతలుగా మారాయి. కుక్కడం-పాములపహాడ్‌, చివ్వెంల-ముకుందాపురం, దురాశ్‌పల్లి-గరిడేపల్లి, వలిగొండ-చందేపల్లి, మునగాల-కొక్కిరేణి రోడ్డు, కొత్తగూడెం-భూదాన్‌పోచంపల్లి రోడ్డు అధ్వానంగా మారాయి. తక్కెళ్లపాడు-మనిమద్దె, మిర్యాలగూడ-దిలావర్‌పూర్‌, నల్లగొండ-యాచారం రోడ్లు చిద్రమై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లాకు రూ.420కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు సిద్ధంకాగా అధికారులు టెండర్లకు వెళ్తున్నారు. తాజా పనుల పరిస్థితి ఏమిటోనన్న సంశయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆర్‌అండ్‌బీ అధికారుల్లోనూ నెలకొంది.

రూ.10కోట్ల పనులు చేస్తే.. వచ్చింది రూ.కోటి70లక్షలే : పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంట్రాక్టర్‌

నల్లగొండ పట్టణంలో ఎంతోకాలంగా రోడ్డుకాంట్రాక్టు పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం నుంచి నిధుల రాకలో సమ స్య ఉందని తెలిసినా అధికార పార్టీ నేతలు, అధికారుల ఒత్తిడి మేరకు ఏడాది క్రితం రహదారి విస్తరణ పనులు చేపట్టాం. ఇప్పటికే రూ.10కోట్ల విలువైన పనులు పూర్తి చేయగా ఇప్పటి కి మాకు వచ్చిన నిధులు రూ.కోటి70లక్షలే.

సమస్యలుంటే మాట్లాడుకోవాలి : పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి

కాంట్రాక్టర్లు సమస్యలు ఉంటే వారి అసోసియేషన్‌ నుంచి ప్రభుత్వం, జిల్లా మంత్రిపై ఒత్తిడి చేయాలి, మాట్లాడుకోవాలి. కానీ పనులు మొదలుపెట్టకపోవడం సరైంది కాదు. అటు ప్రజా ప్రతినిధులు, ఇటు కాంట్రాక్టర్ల మధ్య నలిగిపోతున్నాం.

Updated Date - 2022-12-07T23:36:20+05:30 IST