అన్నదమ్ముల మధ్య భూవివాదం.. తమ్ముడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-18T18:25:54+05:30 IST

కురవి మండలం నేరడ శివారు మంచ్యా తండాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది.

అన్నదమ్ముల మధ్య భూవివాదం.. తమ్ముడి ఆత్మహత్య

Mahaboobabad : కురవి మండలం నేరడ శివారు మంచ్యా తండాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. తమ్ముడు వెంకన్న(45)పై అన్న బాలు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వెంకన్న అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read more