Munaver షోకి అనుమతి.. కొట్టి పంపిస్తాం.. తగ్గేదేలే అన్న రాజాసింగ్..

ABN , First Publish Date - 2022-08-19T18:18:58+05:30 IST

మునావర్ ఫారుఖీ(Munawar Faruqui) స్టాండప్ కామెడీ షోకు పోలీసుల నుంచి అనుమతి లభించింది.

Munaver షోకి అనుమతి.. కొట్టి పంపిస్తాం.. తగ్గేదేలే అన్న రాజాసింగ్..

Hyderabad : మునావర్ ఫారుఖీ(Munawar Faruqui) స్టాండప్ కామెడీ షోకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. రేపు శిల్పకళావేదిక(Shilpakalavedika)లో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. మునావర్ షోకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని రాజాసింగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కర్ణాటక సర్కార్(Karnataka Government) సైతం మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది. 


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి నుంచి రాజాసింగ్ బయటకు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు. మొత్తానికి మునావర్ ఫారూఖీ హైదరాబాద్(Hyderabad) పర్యటన సెగలు రేపుతోంది. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను తగులబెడతామని రాజాసింగ్ హెచ్చరిస్తూ వస్తున్నారు. 


ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసుల(Telangana Police)కు, తెలంగాణ ప్రభుత్వా(Telangana Government)నికి సూచించారు. కామెడీ షో(Comedy Show)లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీ(DGP)ని సైతం కలిశారు. అయినా కూడా ఈ షోకు అనుమతి లభించింది. ఇక రేపే షో జరగనుండటంతో తెలంగాణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

నుపూర్ శర్మ మాదిరి నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చు..

షోకి అనుమతి లభించిన నేపథ్యంలో రాజసింగ్ మాట్లాడుతూ.. ‘‘మునావర్ ఫారుకీ షోను అడ్డుకుని తీరుతాం. ధర్మాన్ని కాపాడే క్రమంలో పార్టీ సస్పెండ్ చేసినా బాధపడను. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మ మాదిరి నన్ను కూడా సస్పెండ్ చేయొచ్చు. అమిత్ షా సభకు నేను హాజరుకావటం పోలీసుల మీద ఆధారపడి ఉంది. ఫారుకీ పూజించే మహ్మద్ ప్రవక్త బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను సస్పెండ్ అయినా మోదీ, అమిత్ షాలకు ఫాలోవర్‌గా ఉంటాను. పార్టీ కంటే .. ధర్మాన్ని కాపాడటమే నాకు ముఖ్యం. హిందువులకు క్షమాపణలు చెప్పాకనే.. మునావర్ ఫారుకీ షో నిర్వహించాలి. సీతారాముళ్లను కించపరిచిన వ్యక్తికి కేటీఆర్ అండగా నిలవటం శోచనీయం. షో లోపలే మునావర్ ఫారుకీని కొట్టేందుకు ప్లాన్ చేశాం. షోకి ఎంట్రీ పాస్ లను కూడా మా రామ భక్తులు సంపాదించారు. కేసీఆర్, కేటీఆర్ లు హిందూ సమాజానికి చీడ పురుగులు’’ అని పేర్కొన్నారు.Read more