బండి సంజయ్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: బాల్క సుమన్

ABN , First Publish Date - 2022-04-24T20:14:46+05:30 IST

బండి సంజయ్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: బాల్క సుమన్

బండి సంజయ్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: బాల్క సుమన్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ త్యాగాలు తెలియని సన్నాసి సంజయ్ అని బాల్క సుమన్‌ విమర్శించారు. కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం రాజీనామా చేయని ద్రోహి కిషన్‌రెడ్డి అని ఆయన మండిపడ్డారు. చిల్లర వ్యక్తులంతా కేసీఆర్‌పై మొరుగుతున్నారని, బీజేపీకి రేవంత్‌రెడ్డి అమ్ముడుపోయారని బాల్క సుమన్‌ విమర్శించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన కుటుంబాలకు క్షమాపణ చెప్పి.. రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గవర్నర్ పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌ ఎందుకిస్తున్నారు? అని బాల్క సుమన్ ప్రశ్నించారు.

Read more