కోడి పందాల నిర్వహణలో చింతమనేని ఉన్నారు: పఠాన్‌చెరు DSP

ABN , First Publish Date - 2022-07-07T19:35:34+05:30 IST

పటాన్‌చెరు మండలం చినకంజర్లలో జరిగిన కోడిపందాల నిర్వహణలో తాను లేనని...

కోడి పందాల నిర్వహణలో చింతమనేని ఉన్నారు: పఠాన్‌చెరు DSP

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం చినకంజర్లలో జరిగిన కోడిపందాల నిర్వహణలో తాను లేనని... ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా? అంటూ ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(chintamaneni prabhakar) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై పఠాన్‌చెరు డీఎస్పీ(DSP) భీమ్ రెడ్డి(Bheem reddy) స్పందించారు. ఏబీఎన్‌తో మాట్లాడుతూ... పఠాన్ చెరువు శివారు ప్రాంతాల్లో మామిడి తోటలో కోడి పందాలు నిర్వహించారన్నారు. ఈ కేసులో మెయిన్ ఆర్గనైజర్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారని...  తాము మఫ్టీలో రైడ్స్ చేసినప్పుడు పోలీసుల నుండి తపించుకొని పరారయ్యారని తెలిపారు. అక్కినేని సతీష్, కృష్ణం రాజు, బర్ల శీను ఆర్గనైజర్లగా ఉన్నారని...  వారు కూడా చింతమనేని పేరు చెప్పారని అన్నారు. సోషియల్ మీడియాలో చింతమనేని పెట్టిన పోస్ట్‌కు కచ్చితంగా కౌంటర్ ఇస్తామన్నారు. కోడి పందాలు ఆడిస్తున్నట్లు తమ దగ్గర చింతమనేని వీడియో ఉందని డీఎస్పీ చెప్పారు.


వీరు అందరూ వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని ఈ కోడి పందాలు ఆడిస్తున్నారన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. చింతమనేనితో పాటు మరో 40 మంది పరారైనట్లు తెలుస్తోందన్నారు. పరారీలో ఉన్న వారికి కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామని తెలిపారు. బీదర్‌లో కోడి పందాలు ఆడిస్తుండగా అక్కడ పోలీసులు వెంట పడడంతో ఇక్కడ వచ్చి ఆర్గనైజ్ చేసినట్లు చెప్పారు. ‘‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు... ఆయన పెట్టిన పోస్టింగ్‌పై మేము త్వరలో వీడియో రిలీజ్ చేస్తాము’’ అని డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. 

Read more