పరిగి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట Congress నేతల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-23T19:09:10+05:30 IST

జిల్లాలోని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పరిగి ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

పరిగి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట Congress నేతల ఆందోళన

వికారాబాద్: జిల్లాలోని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పరిగి ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది నియామకంపై కలెక్టర్ స్పందించాలన్నారు.  ఆస్పత్రిలో అటెండర్ వైద్యం అలాగే కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అదేమని అడిగితే వైద్య సిబ్బంది సమర్థించుకుంటుదని ఆరోపించారు. కాగా...కాంగ్రెస్ నేతల ఆందోళనలపై డీసీహెచ్ డాక్టర్ ప్రదీప్ కుమార్ స్పందిస్తూ... దిద్దుబాటు చర్యలు చేపట్టామని తెలిపారు. సూపరింటెండెంట్ను మార్చి ఇద్దరు వైద్యులను నియమించామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై వేటు వేశామన్నారు. మరో వైద్యుడు మద్గుల్ చిట్టంపల్లి బస్తీ దవాఖానాకు డిప్యూటేషన్‌పై పంపినట్లు డీసీహెచ్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-23T19:09:10+05:30 IST