తెలంగాణలో పిల్లల వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపని తల్లిదండ్రులు
ABN , First Publish Date - 2022-01-04T14:12:08+05:30 IST
తెలంగాణలో పిల్లల వ్యాక్సినేషన్‌పై తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దేశవ్యాప్తంగా జనవరి3న 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణలో పిల్లల వ్యాక్సినేషన్‌పై తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దేశవ్యాప్తంగా జనవరి3న 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తెలంగాణలో 15నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు 18,41,000 కాగా.. మొదటి రోజు వాక్సినేషన్‌లో 24,240 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. కొన్ని జిల్లాలో 0 శాతం వాక్సినేషన్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 7శాతం వ్యాక్సినేషన్ నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో 4శాతం, ఆదిలాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో 3శాతం వ్యాక్సినేషన్ నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్, మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, నిర్మల్ జిల్లాలో 2శాతం వాక్సినేషన్ నమోదైంది. మెదక్, నల్లగొండ, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 0 శాతం, మిగతా జిల్లాలో 1శాతం వ్యాక్సినేషన్ నమోదైంది.