పాకాలలో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2022-08-29T04:33:55+05:30 IST

పాకాలలో పర్యాటకుల సందడి

పాకాలలో పర్యాటకుల సందడి
పాకాల తూముపై నుంచి సరస్సు అందాలను వీక్షిస్తున్న పర్యాటకులు

ఖానాపురం, ఆగస్టు 28: మండలంలో ప్రముఖ పర్యాటక పాంతమైన పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. నిండుకుండలా ఉన్న పాకాల సరస్సు ప్రకృతి అందాలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచిపర్యాటకులు తరలివచ్చారు. ఆయకట్టులో వరినాట్లు పూర్తి కావడంతో వారం రోజులుగా పలు గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు, రైతు కూలీలు పాకాలకు వచ్చి కట్టమైసమ్మకు మొక్కులు చెల్లించుకొని వనభోజనాలు చేసి వెళ్తున్నారు. కాగా, ఈ ఏడాది అటవీశాఖ అధికారులు వంటలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో పర్యాటకులతో పాటు రైతులు, రైతు కూలీలు సరస్సు సమీపంలోని నర్సంపేట-కొత్తగూడ రోడ్డు వెంట ఉన్న చెట్ల కింద వంటలు చేసుకొంటున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-29T04:33:55+05:30 IST