ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్

ABN , First Publish Date - 2022-03-12T00:57:38+05:30 IST

దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే

ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.  ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆప్‌ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో అన్నివర్గాలకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-03-12T00:57:38+05:30 IST