పోస్టల్‌ పార్సిల్‌ సర్వీసులో ఆన్‌లైన్‌ చెల్లింపులు

ABN , First Publish Date - 2022-07-07T09:56:35+05:30 IST

తపాలా శాఖ హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 5120 పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులతో పార్సిల్‌ సర్వీసులను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తపాలా శాఖ సహాయ సంచాలకుడు సీహెచ్‌.

పోస్టల్‌ పార్సిల్‌ సర్వీసులో ఆన్‌లైన్‌ చెల్లింపులు

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 5120 పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులతో పార్సిల్‌ సర్వీసులను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తపాలా శాఖ సహాయ సంచాలకుడు సీహెచ్‌. రామకృష్ణ తెలిపారు. అలాగే 11 ప్రదేశాల్లో సురక్షిత,  ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌ కోసం  ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కస్టమర్‌ ఫ్రెండ్లీ ఇండియా పోస్టల్‌ పార్శిల్‌ ేసవలను బుధవారం జనగామ ప్రధాన పోస్టాఫీసులో  హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎ్‌స.రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. గ్రామ స్థాయిల్లో ఔత్సాహిక వ్యాపారుల సహకారంతో  654 ఫ్రాంఛైజీ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌లలోనూ పార్సిళ్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. గద్వాల్‌,  పోచంపల్లి కేంద్రాల నుంచి పార్సిళ్లను సురక్షితంగా చేరవేయడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.

Read more