సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-09-30T15:56:19+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station)లో ఒక చిన్నారి కిడ్నాప్‌నకు గురయ్యాడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station)లో ఒక చిన్నారి కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఆర్పీఎఫ్ పోలీసులు (RPF) గంటల వ్యవధిలోనే ఛేదించారు. మహిళ వద్ద నుంచి బాలుడిని యువతి ఎత్తుకొని తీసుకువెళ్లింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ (Guntur to Secunderabad) చేరుకున్న ఒంటరి మహిళ వద్ద బాబుని గుర్తించిన ఓ మహిళ ఎలాగైనా ఆ బాబుని ఎత్తుకెళ్లాలని భావించింది. ఈ క్రమంలోనే తల్లితో మంచిగా నటిస్తూ.. బాబుకి బిస్కట్లు ఇచ్చి మంచిగా మెలిగింది. దీంతో ఆ తల్లి బాబుని ఆమెకు అప్పగించి వాష్‌రూమ్‌కి వెళ్లింది. 


తల్లి అటు వాష్ రూమ్‌కి వెళ్ళగానే వెంటనే మహిళ బాబును తీసుకొని పరారయ్యింది. సికింద్రాబాద్ నుంచి ఆటోలో బాలుడుతో సహా మాయమైంది. వెంటనే విషయాన్ని గ్రహించిన తల్లి ఆర్పీఎఫ్ సిబ్బందిని కలిసింది. బాలుడిని రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మహిళను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక టీంలను పోలీసులు ఏర్పాటు చేశారు. అంతే.. గంటల వ్యవధిలో పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాబును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని తీసుకువెళుతున్న మహిళను గుర్తించారు. వెంటనే ఆమె వెళ్లే ఆటోను గుర్తించి కవాడిగుడలో పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్‌ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాబుని తల్లికి అప్పగించారు.

Read more