ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌

ABN , First Publish Date - 2022-04-24T20:34:36+05:30 IST

ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌

ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ప్రభుత్వంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేయడం లేదని, గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ రాయడం అర్థరహితమని ఎమ్మెల్సీ పల్లా అన్నారు. మెడికల్‌ సీట్ల విషయంలో అక్రమాలకు చెక్‌పెట్టేలా ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారంలో మంత్రులు, తన ప్రమేయం ఉంటే కాలేజీని ప్రభుత్వానికి అప్పగిస్తామని ప్రకటించామని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏ సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని,తాను ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ స్పష్టం చేశారు.

Read more