సభ్యత్వంలో దేశంలోనే నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2022-03-05T06:50:37+05:30 IST

40లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు చేసి దేశంలో నెంబర్‌ వన్‌గా

సభ్యత్వంలో దేశంలోనే నెంబర్‌ వన్‌

  •  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): 40లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు చేసి దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిచామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 80లక్షల ఓట్లు వస్తే రాష్ట్రంలో అధికారం కాంగ్రె్‌సదేనని, 40లక్షల మంది సభ్యులు తమతో పాటు మరో ఓటు వేయిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మరో పది లక్షల సభ్యత్వాలు చేయించాలని ఆయన కోరారు. శుక్రవారం ఇందిరా భవన్‌లో జరిగిన డిజిటల్‌ మెంబర్‌ షిప్‌ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సభ్యత్వానికి వస్తున్న మద్దతును చూసి సీఎం కేసీఆర్‌ భయపడి పీకేను తెచ్చుకున్నారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే టికెట్లని, ఎలాంటి పైరవీ లేకుండా టికెట్‌ ఇప్పించ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన అన్నారు.  కాగా, తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు. ఉన్నతాధికారుల నియామకాలో బిహార్‌ వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.  


Read more