Political Heat: ఓవైపు ఎన్టీఆర్.. మరోవైపు కేసీఆర్.. ఖమ్మం జిల్లాలో ఫ్లెక్సీల కలకలం

ABN , First Publish Date - 2022-09-29T22:58:53+05:30 IST

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cm Kcr) జాతీయ పార్టీ (National Party) ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో...

Political Heat: ఓవైపు ఎన్టీఆర్.. మరోవైపు కేసీఆర్.. ఖమ్మం జిల్లాలో ఫ్లెక్సీల కలకలం

ఖమ్మం (Kmm): టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cm Kcr) జాతీయ పార్టీ (National Party) ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా వెలసిన ఓ ఫ్లెక్సీ (Flexy) కలకలం రేపుతోంది. ఒకే ఫ్లెక్సీలో ఓ వైపు ఎన్టీఆర్ (Ntr), మరోవైపు కేసీఆర్ ఫొటోలు (Photos) ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముడిగొండ మండలం ఖానాపురంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Vijay) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫొటో.. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటో వేసిన ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ‘తెలుగోడి ఆత్మగౌరవం నిలుపు.. దేశ్‌కీ నేత కేసీఆర్’ అని ఉండటంతో జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 



Read more