ఎన్‌ఎస్‌యూఐ నేత Balmuri venkat ముందస్తు అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-11T13:56:28+05:30 IST

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

ఎన్‌ఎస్‌యూఐ నేత Balmuri venkat ముందస్తు అరెస్ట్

హైదరాబాద్‌: ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌ (Balmuri venkat)ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళుతుండగా మేడిపల్లి వద్ద వెంకట్‌ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో బల్మూరి వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ఓ నాయకుని కుమారుడు చనిపోతే వెళుతున్నానని చెప్పినా పోలీసులు వదలని పరిస్థితి. కాగా... టెట్‌ వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డిని అడ్డుకుంటారనే అనుమానంతో బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2022-06-11T13:56:28+05:30 IST