1397.82 అడుగులకు చేరిన Nizamsagar ప్రాజెక్ట్ నీటిమట్టం
ABN , First Publish Date - 2022-07-14T14:51:43+05:30 IST
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar project)కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది.
కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar project)కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి 21760 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ ప్రస్తుతం నీటి మట్టం 1397.82 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 9.156 టీఎంసీలకు చేరుకుంది.