Nizamabadలో ఉగ్ర కలకలం
ABN , First Publish Date - 2022-07-06T16:23:03+05:30 IST
జిల్లాలో ఉగ్ర లింకుల కలకలం రేపుతోంది. నిషేధిత సీమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్‌తో కుట్ర బయటపడింది.

నిజామాబాద్: జిల్లాలో ఉగ్ర లింకుల కలకలం రేపుతోంది. నిషేధిత సీమీ అనుబంధ సంస్థ పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్‌తో కుట్ర బయటపడింది. పీఎప్ఐ ట్రైనింగ్ పేరుతో మత ఘర్షణలకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటోనగర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా... పోలీసులు భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, కడపకు చెందిన యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మరణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి. మత ఘర్షణలు జరిగినప్పుడు భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.