Nizamabad: ఆర్మూర్‌లో ఎన్ఐఏ సోదాలు
ABN , First Publish Date - 2022-08-01T03:58:52+05:30 IST
ఆర్మూర్ (Armoor)లో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. జిరాయత్‌నగర్‌లో నసీర్ అహ్మద్ (Naseer Ahmed) అనే ..

నిజామాబాద్ (Nizamabad): ఆర్మూర్ (Armoor)లో ఎన్ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహించారు. జిరాయత్‌నగర్‌లో నసీర్ అహ్మద్ (Naseer Ahmed) అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేశారు. నదీమ్ బ్యాంక్ ఖాతాలో అనుమానిత లావాదేవీలను పరిశీలించారు. విదేశాల నుంచి నగదు బదలాయింపులు జరిగినట్లు గుర్తించారు. నసీర్ అహ్మద్ కుమారుడు ఎస్కే నవీద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాపులర్ ఫ్రంట్ ఇండియా (Popular Front India) కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.