Sangareddy: నిమ్జ్ భూ బాధితులు అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-22T18:08:59+05:30 IST
జిల్లాలో నిమ్జ్ భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 35 మంది ఎల్గోయి, మామిడిగి వాసులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంగారెడ్డి: జిల్లాలో నిమ్జ్ భూ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 35 మంది ఎల్గోయి, మామిడిగి వాసులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో రాయికోడ్ పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. జహీరాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా... రాయికోడ్ పోలీస్‌స్టేషన్ వద్ద భూ బాధితుల వీడియోలు చిత్రీకరించకుండా మీడియాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.
మరోవైపు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా పలుగ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.