అంతర్జాతీయ ఎమ్ఎస్ఎమ్ఇ దినోత్సవం-పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-23T23:08:52+05:30 IST

జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ (ni-msme) హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ఎమ్ఎస్ఎమ్ఇ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 27న

అంతర్జాతీయ ఎమ్ఎస్ఎమ్ఇ దినోత్సవం-పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

హైదరాబాద్: జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య  తరహా పరిశ్రమల సంస్థ (ni-msme) హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ఎమ్ఎస్ఎమ్ఇ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 27న అంతర్జాతీయ ఎమ్ఎస్ఎమ్ఇ  దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఔత్సహిక, సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమంలో బ్యాంకు రుణాల కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, రుణాలు మంజూరు కావడానికి కావలసిన పత్రాలు, విధివిధానాలు, ప్రభుత్వ రుణ పథకాల వంటి పలు అంశాలపై ఔత్సహిక యువతకు అవగాహన కల్పిస్తారు.


ఆసక్తిగల యువతి యువకులు జూన్ 27 తేదీ ఉదయం 10 గంటలకు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ యూసఫ్ గూడ ప్రాంగణానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది.మరిన్ని వివరాలకు ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ ప్రోగ్రామ్ డైరెక్టర్ జి.సుదర్శన్ ను 9494959108 లేదా 040-23633228 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-06-23T23:08:52+05:30 IST