బాక్సర్ Nikhat zareen, షూటర్ ఇషాసింగ్‌కు కేసీఆర్ సన్మానం
ABN , First Publish Date - 2022-06-02T23:01:38+05:30 IST
బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌ను సీఎం కేసీఆర్ సన్మానించారు. క్రీడాకారిణులు, వారి తల్లిదండ్రులకు ప్రగతి భవన్లో సీఎం ఆతిథ్యం ఇచ్చారు.

హైదరాబాద్: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌ను సీఎం కేసీఆర్ సన్మానించారు. క్రీడాకారిణులు, వారి తల్లిదండ్రులకు ప్రగతి భవన్లో సీఎం ఆతిథ్యం ఇచ్చారు. క్రీడాకారిణులతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. యుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat zareen)కు సీఎం కేసీఆర్ CM Kcr భారీ నజరానా ప్రకటించారు. నిఖత్ జరీన్‌తో పాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ తేజం ఇషా సింగ్‌కు కూడా భారీ నజరానా ఇచ్చారు. వీరిద్దరికి చెరో రూ.2 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయిస్తున్నట్లు తెలిపింది. జూబ్లీహిల్స్ లేదా, బంజారాహిల్స్‌లో ఈ స్థలం కేటాయించనున్నట్లు సమాచారం.