కేసీఆర్‌ నంబర్‌ వన్‌ ద్రోహి

ABN , First Publish Date - 2022-10-07T08:35:51+05:30 IST

‘‘ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన వారిలో నంబర్‌ వన్‌ ద్రోహి కేసీఆర్‌.

కేసీఆర్‌ నంబర్‌ వన్‌ ద్రోహి

ఏపీకి వస్తే తరిమి తరిమి కొడతాం: తులసిరెడ్డి

కడప: ‘‘ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన వారిలో నంబర్‌ వన్‌ ద్రోహి కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌కు వీడ్కోలు పలికి, బీఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్రంలో అడుగు పెడితే తరిమి తరిమి కొడతాం’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీమాంధ్ర ప్రజలంటే కేసీఆర్‌కు చులకన. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రులను పంచెలు ఊడదీసి కొడతామని, వారు తినే బిర్యాని పేడలాగా ఉంటుందని తీవ్ర పదజాలంతో ఆంధ్రుల హృదయాలను గాయపరిచాడు. కేసీఆర్‌ లాంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీని నడిపే హక్కు లేదు. ప్రత్యేక హోదాకు, పోలవరం నిర్మాణానికి అడ్డంకిగా మారిన కేసీఆర్‌కు ఇక్కడ స్థానం లేదు.’’ అని తులసిరెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-10-07T08:35:51+05:30 IST