గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్‌: సత్యవతి

ABN , First Publish Date - 2022-09-19T09:13:40+05:30 IST

రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్‌ ఒక ఆరాధ్య దైవంగా మారారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్‌: సత్యవతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్‌ ఒక ఆరాధ్య దైవంగా మారారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బంజారాలు, ఆదివాసీలపైన వరాల జల్లు కురిపించిన ఆయనకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో పాటు 10ు రిజర్వేషన్‌, గిరిజన బంధు, పోడు భూములకు వ్యవసాయ హక్కులు కల్పిస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు బతకొద్దన్న విధంగా వ్యవహరిస్తున్న బీజేపీతో దేశానికి ముప్పు పొంచి ఉందని ఆమె ఆరోపించారు.  

Read more