ఎన్‌సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
ABN , First Publish Date - 2022-10-17T06:03:42+05:30 IST
ఎన్‌సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
క్యాంపు కమాండింగ్ అధికారి అజయ్ నంద
మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో ఎన్‌సీసీ క్యాంపు ప్రారంభం
మామునూరు, అక్టోబరు 16: విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎన్‌సీసీ పదవ తెలంగాణ బెటాలియన్ క్యాంపు కమాండింగ్ అధికారి కల్నల్ అజయ్ నంద ఖండూరి అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని పోలీసు శిక్షణ కళాశాలలో ఆదివారం పదవ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో కంబైండ్ అన్యువల్ శిక్షణ క్యాంపునకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో ఎన్‌సీసీ శిక్షణ తీసుకుంటే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ఇండియన్ ఆర్మీ తర్వాత క్రమశిక్షణ కలిగిన రెండో ఆర్మీ ఎన్‌సీసీ అని తెలిపారు. దేశం కోసం ఎన్‌సీసీ క్యాడెట్లు పునాది రాళ్లుగా పని చేస్తున్నట్లు అజయ్ నంద ఖండూరి వివరించారు. దేశ యువతకు ఎన్‌సీసీ ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు ఏవో లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ జాగ్తప్, సుబేదార్ మేజర్ సుహాన్ కదం, ఏఎన్‌వో రవి, రాఽధాక్రిష్ణ, ట్రైనింగ్ అధికారి సతీష్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి 565 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.