Nalgonda: మిర్యాలగూడలో టెన్షన్..టెన్షన్..

ABN , First Publish Date - 2022-09-11T16:37:58+05:30 IST

రెండు నెలలుగా జీతాల్లేవు! కుటుంబాన్ని పోషించుకునే దారి లేదు! ఆ మనో వేదనతోనే మరో వీఆర్‌ఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా మిర్యాలగూడ

Nalgonda: మిర్యాలగూడలో టెన్షన్..టెన్షన్..

Nalgonda: రెండు నెలలుగా జీతాల్లేవు! కుటుంబాన్ని పోషించుకునే దారి లేదు! ఆ మనో వేదనతోనే మరో వీఆర్‌ఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) మండలం ఊట్లపల్లిలో శనివారం చోటుచేసుకుంది. వీఆర్ఏ(VRA) ఆత్మహత్యతో మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వీఆర్ఏ(VRA) వెంకటేశ్వర్లు(Venkateshwar) ఆత్మహత్య నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏకు మద్దతుగా ఉట్లపల్లికి పెద్దసంఖ్యలో వీఆర్ఏలు తరలివస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ఉట్లపల్లిలో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వీఆర్ఏలను ముందస్తుగా అరెస్ట్లు చేస్తున్నారు.

Read more