Musi ప్రాజెక్ట్ ఆరు గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-07-14T14:26:33+05:30 IST
మూసీ ప్రాజెక్టు(Musi project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది.
నల్లగొండ: మూసీ ప్రాజెక్టు(Musi project)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3553.33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3553.33 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 638.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.84 టీఎంసీలుగా నమోదు అయ్యింది.