టీఆర్ఎస్‌లో మునుగోడు ముసలం

ABN , First Publish Date - 2022-09-10T19:51:08+05:30 IST

టీఆర్ఎస్‌లో మునుగోడు(Munugode) ముసలం కొనసాగుతోంది. మునుగోడు అభ్యర్థి(Munugode Contestant) ఎవరన్నదానిపై గులాబీ

టీఆర్ఎస్‌లో మునుగోడు ముసలం

Munugode : టీఆర్ఎస్‌లో మునుగోడు(Munugode) ముసలం కొనసాగుతోంది. మునుగోడు అభ్యర్థి(Munugode Contestant) ఎవరన్నదానిపై గులాబీ నేతల్లో(TRS Leaders) ఉత్కంఠ చోటు చేసుకుంది. టికెట్‌ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మునుగోడు టీఆర్‌ఎస్ టికెట్‌(TRS Ticket)ను బీసీ నేతలు(BC Leaders) ఆశిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ(Congress Party) అభ్యర్థిని ప్రకటించింది. అలకలు తీర్చే పనిలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బరిలో రెడ్డి సామాజికవర్గ నేతలు ఉన్నారు.


అయితే టీఆర్ఎస్ టికెట్‌(TRS Ticket)ను సైతం రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌(Farmer MLA Kusukuntla Prabhakar) లేదా మండలి చైర్మన్ గుత్తా(Gutha) మధ్య పోటీ నెలకొంది. కూసుకుంట్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సర్వే(Survey)ల ఆధారంగా అభ్యర్థిని కేసీఆర్‌ ప్రకటించనున్నారు. అయితే వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
Read more