Munugode By Poll: మునుగోడులో అమిత్‌షా సభపై వీడిన సస్పెన్స్.. 21న సభ అవ్వగానే..

ABN , First Publish Date - 2022-08-18T02:29:30+05:30 IST

మునుగోడులో (Munugode) అమిత్‌షా (Amith Sha) సభపై సస్పెన్స్ వీడింది. ఆగస్ట్ 21న అమిత్‌షా భారీ బహిరంగ సభ (Amith Sha Munugode Public Meeting) మునుగోడు వేదికగా..

Munugode By Poll: మునుగోడులో అమిత్‌షా సభపై వీడిన సస్పెన్స్.. 21న సభ అవ్వగానే..

భువనగిరి: మునుగోడులో (Munugode) అమిత్‌షా (Amith Sha) సభపై సస్పెన్స్ వీడింది. ఆగస్ట్ 21న అమిత్‌షా భారీ బహిరంగ సభ (Amith Sha Munugode Public Meeting) మునుగోడు వేదికగా జరగనుంది. అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopalreddy) సహా పలువురు నేతలు బీజేపీలో (BJP) చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారు. ఇదిలా ఉండగా మునుగోడు సభకు సంబంధించి బీజేపీ నాయకులు సభా ఏర్పాట్లను పరిశీలించారు. డీసీసీ బీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి సభా స్థలిని సందర్శించారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.



మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ (BJP Focus On Munugode) పెట్టింది. ఆగస్ట్ 21న మునుగోడులో అమిత్ షా సభ (Munugodu Amit Shah Meeting) జరగనుంది. అమిత్ షా సభ తర్వాత స్థానిక బీజేపీ నేతలు ఏం చేయాలనే విషయంలో కూడా బీజేపీ హై కమాండ్ ఇప్పటికే క్లియర్‌గా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి మునుగోడులో బీజేపీ నేతలు మకాం వేయనున్నారు. ఈ నెల 21న అమిత్‌షా సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ (Election Committee) వేయనుంది. అమిత్‌షా (Amit Shah) సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారన్న విషయం తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంతో బలం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర మంత్రులు (Union Ministers), జాతీయ నేతలు కూడా రానున్నారంటే ఒక మినీ అసెంబ్లీ ఎన్నికల సీన్ కనిపించనుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



ఉప ఎన్నికను బీజేపీ అధిష్ఠానంతో (BJP High Command) పాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers) రాజకీయ జీవితానికి సవాల్‌గా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. బీజేపీ కీలక నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్‌ (Etela Rajender), వివేక్‌ (Vivek), జితేందర్‌రెడ్డి (jithender reddy) కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈ గ్రామం కేంద్రం గానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు (Ex MP Vivek) అప్పగించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) బీజేపీ రాష్ట్ర నేతలను (BJP State Leaders) కోరారు. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (Mahabubnagar Ex MP) త్వరలో మునుగోడులో (Munugodu) మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ (BJP) ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-08-18T02:29:30+05:30 IST