Ranjith Reddy : సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు

ABN , First Publish Date - 2022-12-07T13:16:35+05:30 IST

సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

Ranjith Reddy : సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు

Ranjith Reddy : సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ సౌత్ ఇండియాలో అతిపెద్ద కంపెనీ అని పేర్కొన్నారు. సింగరేణిని ఆక్షన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరినా.. ఇవ్వట్లేదన్నారు. పాలసీ ప్రకారం ఆక్షన్ పెట్టామని కేంద్రం చెబుతోందన్నారు. 11 A కండిషన్‌లో తమకు కేటాయించాలని కోరామన్నారు. నాలుగు బ్లాక్‌లు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారన్నారని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వనికి 51%, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-07T13:16:36+05:30 IST